: పెండ్లిపాక రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసిన హరీష్ రావు, జగదీశ్ రెడ్డి
నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా నేటి ఉదయం తెలంగాణ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి పెండ్లిపాక రిజర్వాయర్ కు శంకుస్థాపన చేశారు. చందంపేట మండలం నేరేడుగొమ్మలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్‌లో అంతర్భాగంగా, పెండ్లిపాక రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలోని ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకే రిజర్వాయర్ ను నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా హరీష్ రావు వెల్లడించారు. అనంతరం, కలెక్టరేట్ లో జరిగే జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొనేందుకు నల్గొండకు బయలుదేరి వెళ్లారు.