: నెక్లెస్ రోడ్డులో బైక్ రేసులు... రంగంలోకి దిగిన పోలీసులు

హైదరాబాద్ నగరంలోని నెక్లెస్ రోడ్డులో బైక్ రేసులతో యువకులు హంగామా చేస్తున్నారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు 60 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నెక్లెస్ రోడ్డులో బైక్ రేసింగ్ చేస్తూ తమకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని మార్నింగ్ వాకర్లు ఫిర్యాదులు చేయడంతో, పోలీసులు ఆదివారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. సెలవు దినం కావడంతో బైక్ రేసింగ్ కోసం పెద్ద సంఖ్యలో నెక్లెస్ రోడ్డుకు చేరుకున్న యువకులు బుక్కయ్యారు. నగర శివారు ప్రాంతం గండిపేటలో పోలీసుల తనిఖీలు ఎక్కువ కావడంతో, బైక్ రేసింగ్ ల కోసం యువకులు ఇటీవల నెక్లెస్ రోడ్డుకు వస్తున్నారు.

More Telugu News