: సహారా స్కాంలో మోదీకి భాగస్వామ్యం... ఇదిగో సాక్ష్యం: మమత

ప్రజలను మోసం చేసి సహారా గ్రూప్ వేల కోట్ల రూపాయలను వెనకేసుకున్న ఉదంతంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రమేయముందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపణలు గుప్పించారు. అందుకు సాక్ష్యంగా, గతంలో సహారా చీఫ్ సుబ్రతా రాయ్, మోదీలు కలసి ఉన్న చిత్రాన్ని ఆమె చూపారు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో మమత అనుచరులు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీపై ఎదురుదాడి చేసేందుకే ఆమె నిర్ణయించుకున్నట్టు తాజా వ్యాఖ్యలతో తెలుస్తోంది. "ఓ నేరస్తుడితో కలసి ఫోటో దిగితే, అరెస్ట్ చేయడానికి ఆ సాక్ష్యం చాలు. ప్రస్తుతం జైలులో ఉన్న సహారా బాస్ తో మోదీ కలిసి ఉన్నారు. మీరు ఆయనను కూడా అరెస్ట్ చేస్తారా?" అని ఆమె ప్రశ్నించారు.

More Telugu News