: కూకట్పల్లిలో పోలీసుల కార్డన్ సెర్చ్... పట్టుబడ్డ గజదొంగ శివ
హైదరాబాద్ శివారు కూకట్పల్లి పరిసర బస్తీల్లో నేటి తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ డీసీపీ కార్తికేయ ఆధ్వర్యంలో 400 మంది పోలీస్ సిబ్బంది అణువణువూ జల్లెడ పట్టారు. కూకట్పల్లిలోని ఎల్లమ్మబండ, పీజేఆర్కాలనీ, సిక్కుల బస్తీ తదితర ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. గతంలో పలు దొంగతనాల్లో నిందితుడిగా ఉండి కేసులను ఎదుర్కొంటున్న గజదొంగ శివ ఓ ఇంట్లో పట్టుబడ్డట్టు పోలీసులు చెప్పారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 14 ఆటోలు, 2 కార్లతో పాటు 9మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.