: మావోయిస్టు అనుకొని పోలీసుల కాల్పులు... వ్యక్తికి తీవ్ర గాయాలు

పోలీసుల తనిఖీల్లో భాగంగా తన వాహనం ఆపకుండా వెళ్ళిన ఓ వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఖమ్మం జిల్లా చర్ల మండలం దాచేనపల్లి వద్ద మావోయిస్టుల కదలిక సమాచారంతో పోలీసు, సీఆర్‌పీఎఫ్ బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టగా, శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కారం నరసింహారావు అనే వ్యక్తి తన ద్విచక్రవాహనం ఆపకుండా ముందుకు దూకించాడు. దీంతో, మావోయిస్టుగా అనుమానించిన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నరసింహారావు పొట్టభాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన అతడ్ని భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నరసింహారావుకు సంబంధించిన పూర్తి సమాచారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

More Telugu News