: టీఎస్ కేబినెట్ లో ఈ ఐదుగురికి బెర్త్ ఖాయం!
ఈనెల 16న ఉదయం 10 గంటలకు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమంలో కొత్తగా ఆరుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. వీరిలో, ఇటీవలే టీడీపీకి హ్యాండ్ ఇచ్చి టీఆర్ఎస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావుతో పాటు జూపల్లి కృష్ణారావు, చందూలాల్, లక్ష్మారెడ్డి, కొండా సురేఖలకు బెర్త్ ఖాయమయినట్టు తెలుస్తోంది. మరొకరిని ఎంపిక చేయడంపై కసరత్తు జరుగుతోందని సమాచారం. ఆరో పదవి కోసం రవీందర్ రెడ్డి, కోవా లక్ష్మి, ఇంద్రకరణ్ రెడ్డిల పేర్లను పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.