: బెంగళూరు ఐఎస్ఐఎస్ ట్విట్టర్ ఖాతాదారుడి అరెస్ట్
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాలకు సహకరిస్తున్న ఉగ్రవాది మహ్మద్ మన్సూర్ బిశ్వాస్ ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. షమీ విట్ నెస్ పేరిట ట్విట్టర్ లో అతడు నడుపుతున్న ఖాతాకు దాదాపు 17 వేల మందికి పైగా ఫాలోయర్లున్నారని పోలీసులు తెలిప్పారు.
ఇరాక్, సిరియాల్లో నరమేధం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ప్రపంచ దేశాలకు పెనుముప్పుగా పరిణమించిన సంగతి తెలిసిందే. అయితే వారు నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాలకు బెంగళూరు నుంచి ఓ వ్యక్తి సహకరిస్తున్నాడని బ్రిటన్ కు చెందిన వార్తా సంస్థలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన బెంగళూరు పోలీసులు ఎట్టకేలకు అతడిని అరెస్ట్ చేశారు. అరెస్టైన బిశ్వాస్ స్వస్థలం కోల్ కతాగా పోలీసులు గుర్తించారు.