: లౌకికతను కాపాడేందుకు కేంద్రం అన్ని రకాలుగా కృషి చేస్తుంది: వెంకయ్య నాయుడు

భారతదేశంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. మత మార్పిళ్లపై లోక్ సభలో చర్చ జరిగిన సందర్భంగా ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో ఆయన సమాధానమిచ్చారు. భారతదేశం లౌకిక దేశమని, స్వేచ్ఛ, సమానత్వం ప్రాథమిక హక్కులని అన్నారు. దేశ ప్రజలకు ఏది అవసరమో, ప్రజలు ఏది కోరుకుంటారో దానిని కేంద్రం చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరికి నచ్చిన మత విశ్వాసాలను వారు అనుసరించే స్వేచ్ఛ ప్రతి పౌరుడికీ ఉందని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News