: టీచర్ వృత్తికే కళంకం తెచ్చాడు

విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే తప్పుదోవపడితే విద్యార్థులను సన్మార్గంలో ఎలా పెట్టగలడు? అంటూ మధుర వాసులు ప్రశ్నిస్తున్నారు. మధురలోని తక్షశిల పబ్లిక్ స్కూల్ లో గత కొంతకాలంగా టీచర్ జితేంద్ర గౌతమ్ విపరీత బుద్ధిని విద్యార్థుల ముందు బయటపెడుతున్నాడు. స్కూల్ పనిమీద ప్రిన్సిపల్ బయటకు వెళ్తే గౌతమ్ లోని వికృత మనస్తత్వం బయటపడుతోంది. వెంటనే తరగతి గదిలోని పిల్లలకు బ్లూఫిల్మ్ లు చూపిస్తూ పైశాచికానందం పొందుతున్నాడు. దీంతో పిల్లలు జరుగుతున్న తంతును తల్లిదండ్రులకు వివరించారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు స్కూల్ పై దండెత్తి జితేంద్ర గౌతమ్ ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News