: పెళ్లికి కొన్ని గంటల ముందే పెళ్లికొడుకు హత్య...విషాదంలో ఇరు కుటుంబాలు

మొదటి భార్యతో విడాకులు తీసుకుని మరికొన్ని గంటల్లో రెండో పెళ్లికి సిద్ధమవుతున్న పెళ్లికొడుకు ఇంట విషాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన కోటేశ్వరరావు (30) వ్యవసాయం చేస్తుంటాడు. అతనికి మూడేళ్ల క్రితం ఓ మహిళతో పెళ్లైంది. మనస్పర్థలతో ఏడాది క్రితం వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. రేపు పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మొదటి భార్య బంధువులు కోటేశ్వరరావు ఇంటికి వచ్చి కత్తులతో విరుచుకుపడ్డారు. కోటేశ్వరరావు, అతని మేనత్త మల్లమ్మలను నరికి చంపారు. తండ్రి చంద్రయ్య, తల్లి వీరనాగమ్మ, సోదరుడు లింగరాజు, మరో మేనత్త వెంకటమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని ఆసుపత్రికి తరలించారు. దీంతో పెళ్లి కుమారుడు, కుమార్తె కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

More Telugu News