: రక్షణ కొనుగోళ్లకు జనవరి నుంచి కొత్త విధానం: రక్షణ మంత్రి పారికర్
దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించాలని... ఉగ్రదాడులపై తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉందని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. రక్షణశాఖ జరిపే కొనుగోళ్లకు సంబంధించి జనవరి నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. గతంలో అక్రమాలకు పాల్పడిన కంపెనీలను బ్లాక్ లిస్టులో చేర్చే అంశంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రక్షణ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒకే హోదా, ఒకే పింఛను విధానంపై రెండు నెలల్లోగా ప్రకటన చేస్తామని చెప్పారు.