: ఒకరిని బలిగొన్న కల్తీ కల్లు... 15 మందికి తీవ్ర అస్వస్థత

కల్లు దుకాణాలకు లైసెన్సులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం... కల్తీ కల్లును అరికట్టే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. కల్తీకల్లు తాగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, నిజామాబాద్ జిల్లా బీర్కూరు మండలం సంగెం గ్రామంతో కల్తీ కల్లు తాగి ఒకరు మృతి చెందారు. మరో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనపై స్థానికులు మండి పడుతున్నారు. కల్లు బట్టీల వద్ద లంచాలు తీసుకుని అబ్కారీ పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

More Telugu News