: హద్దుల్లో ఉండు: ఆసిస్ బ్యాట్స్ మన్ కు కోహ్లీ హెచ్చరిక

తొలి టెస్టే ముగియలేదు, అప్పుడే టీమిండియా, ఆసీస్ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇప్పటిదాకా ఆసీస్ క్రికెటర్ల దూషణల పరంపర కొనసాగగా, తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసీస్ తీరుపై విరుచుకుపడ్డాడు. తొలుత ఆసీస్ ఓపెనర్ మాటల యుద్ధానికి తెరలేపగా, కోహ్లీ ఘాటుగా స్పందించాడు. హద్దుల్లో ఉండండంటూ ఆస్ట్రేలియా ప్లేయర్లను గట్టిగా హెచ్చరించాడు. తొలుత భారత పేసర్ వరుణ్ ఆరోన్ పై డేవిడ్ వార్నర్ వాదులాటకు దిగాడు. ఆ వాదన అక్కడితో ముగిసిందనుకునేలోగానే అరగంట వ్యవధిలోనే ఆసీస్ బ్యాట్స్ మన్ పై కోహ్లీ విరుచుకుపడ్డాడు. అంపైర్ వారిస్తున్నా వినకుండా... హద్దుల్లో ఉండాలంటూ కోహ్లీ, స్మిత్ కు హెచ్చరికలు జారీ చేశాడు.

More Telugu News