: బాబ్రీ మసీదు ప్రాంతంలోనే రాముడి గుడి నిర్మించాలి: యూపీ గవర్నర్
ఉత్తరప్రదేశ్ గవర్నర్ రాంనాయక్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అయోధ్యలో బాబ్రీ మసీదు ప్రాంతంలోనే రాముడి ఆలయం నిర్మించాలని, ఇదే జాతి మొత్తం కోరుకుంటోందని అన్నారు. అయితే త్వరలోనే ఈ కోరిక నెరవేరుతుందని చెప్పారు. ఫైజాబాద్ లోని అవధ్ విశ్వవిద్యాలయ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన ఆయన పైవిధంగా మాట్లాడారు. అంతేగాక వచ్చే ఐదేళ్లలో రామ జన్మభూమి సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని ప్రధాని నరేంద్రమోదీ చూస్తున్నారని చెప్పారు. ఓ వైపు దేశంలో మత మార్పిడిపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుండగా, యూపీ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.