: రూ. 18 కోట్ల డంప్ ను స్వాధీనం చేసుకున్న మాజీ మావోయిస్టులు?

నల్లమల అడవుల్లోని కర్నూలు, ప్రకాశం జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మాజీ మావోయిస్టులకు రూ. 18 కోట్ల డంప్ లభ్యమైందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గతంలో మావోలు నల్లమల అడవుల్లో కేంద్రీకృతమై ఉండేవారు. ఆ సమయంలో వారు వసూలు చేసిన డబ్బును అక్కడక్కడ అడవిలోనే తవ్వి దాచేవారు. తదనంతర కాలంలో, కొంత మంది మావోలు పోలీసుల దాడుల్లో హతమవ్వగా, మరికొందరు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఈ నేపథ్యంలో, ఒక టీమ్ గా ఏర్పడిన మాజీ మావోయిస్టులు నల్లమల ప్రాంతంలో అన్వేషణ సాగించి, చివరకు ఓ డంప్ ను కనిపెట్టి అందులోని సొమ్మును స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఈ డంప్ విలువ అక్షరాలా రూ. 18 కోట్లు అని తెలుస్తోంది. అయితే, మాజీ మావోలకు డంప్ దొరికిన విషయం తమకు తెలియదని అటవీ అధికారులు చెబుతున్నారు.

More Telugu News