: అంధుల క్రికెట్ జట్టుకు అభినందనల వెల్లువ
ప్రపంచకప్ ను ఎగురవేసుకుని వచ్చిన భారత అంధుల క్రికెట్ జట్టుకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ జట్టుకు ప్రత్యేకంగా అభినందనలు తెలపడంతో పాటు జట్టు సభ్యులను పేరుపేరునా పలుకరించారు. ఢిల్లీలో ఆయన జట్టు సభ్యులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రధాని పలకరింపుతో జట్టు సభ్యులు పొంగిపోయారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా జట్టు సభ్యులను అభినందిస్తూ ప్రకటన విడుదల చేశారు.
జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు సభ్యులున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా జట్టుకు అభినందనలు తెలపనున్నారు. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జట్టు సభ్యుల ఆనందానికి అవధులు లేవు.