: హెల్త్ కార్డులను ఆసుపత్రుల్లో తిరస్కరిస్తున్నారు: టీచర్ల జేఏసీ
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులతో ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసేందుకు నిరాకరిస్తున్నారని ఉపాధ్యాయ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలసిన జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు. పదో పీఆర్ సీని 63 శాతం ఫిట్ మెంట్ తో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులను తీసుకువెళితే ఆసుపత్రుల్లో వైద్యం చేయనంటున్నారని చెప్పారు. వెంటనే ప్యాకేజీ రేట్లను సవరించి ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకుని వైద్యం అందించేలా చూడాలని విన్నవించారు. ఇందుకు ప్రతినెలా ప్రీమియం చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎస్ కు చెప్పారు.