: మహబూబ్ నగర్ జిల్లాలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య

మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ మండలం మరికల్ పట్టణంలో విషాదం అలముకుంది. పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్ సరళ (35) కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆమె ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. సరళ భర్త రాములు కూడా గతంలో మరికల్ సర్పంచ్ గా పనిచేశారు. మహబూబ్ నగర్ వద్ద ప్రత్యర్థుల చేతిలో ఆయన హత్యకు గురయ్యారు. సరళ మృతి పట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు.

More Telugu News