: రాయలసీమలో పాగాకు బీజేపీ ప్రణాళికలు!

ఉత్తరాది రాష్ట్రాల్లో సత్తా చాటిన బీజేపీ తాజాగా దక్షిణాది రాష్ట్రాల్లో బలోపేతమయ్యే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తమిళనాడు, కేరళలతో పాటు కీలకమైన తెలుగు రాష్ట్రాల్లోనూ బలం పెంచుకునేందుకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి రాయలసీమలో పార్టీ ఎదుగుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించిన పార్టీ అధినాయకత్వం ఆ దిశగా వడివడిగా చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా వలసలను ప్రోత్సహిస్తూ ఆ పార్టీ ప్రకటనలను గుప్పిస్తోంది. ఇటీవలే పార్టీలో చేరిన గుంటూరు కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. పార్టీలో చేరేందుకు సీమకు చెందిన నేతల్లో చాలామంది ఆసక్తిగా ఉన్నారని, ఏ ఒక్కరినీ కూడా తమ పార్టీ నిరాశపరచబోదని ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడిన సందర్భంగా వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో రాయలసీమలో పార్టీ గణనీయ వృద్ధిని సాధించనుందని ఆయన ప్రకటించారు.

More Telugu News