: ఏపీలో నేడే రుణమాఫీ అమలుకు చంద్రబాబు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణాల మాఫీ నేటి నుంచి ప్రారంభం కానుంది. తన సొంత జిల్లా చిత్తూరులో సీఎం చంద్రబాబునాయుడు రైతు సాధికారత సదస్సును ప్రారంభించనున్నారు. ఈ సదస్సులోనే ఆయన రుణమాఫీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నేటి ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరే ఆయన చిత్తూరు జిల్లాలో రైతు సాధికారత సదస్సులో భాగంగా రుణమాఫీకి సంబంధించిన బాండ్లను రైతులకు అందించనున్నారు. ఇప్పటికే రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం నేటి నుంచి రుణమాఫీకి తెర లేపుతోంది.