: ఐపీఎల్ ఫిక్సింగ్ పై 'సుప్రీం' విచారణ సోమవారానికి వాయిదా

ఐపీఎల్ ఫిక్సింగ్ స్కాంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముద్గల్ కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం ఐపీఎల్ ఫిక్సింగ్ పై విచారణ కొనసాగిస్తున్న సుప్రీంకోర్టు తాజా విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఎన్నికలను వాయిదా వేయాలన్న బీసీసీఐ ప్రతిపాదనకు అత్యుత్తమ న్యాయస్థానం అంగీకారం తెలిపింది. జనవరి ఆఖరి వరకూ ఎన్నికలు జరపరాదని పేర్కొంది. న్యాయస్థానం అంతకుముందు, బీసీసీఐ పదవా?... ఐపీఎల్ ఫ్రాంచైజీనా?... రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోవాలని ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ కు స్పష్టం చేసింది.

More Telugu News