: నక్సల్స్ ఏడాదికి రూ.140 కోట్లు బలవంతంగా వసూలు చేస్తున్నారట!
వివిధ రకాల వనరుల నుంచి నక్సల్స్ ప్రతి ఏటా రూ.140 కోట్ల వరకు బలవంతంగా వసూలు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. గత పదేళ్లలో 5,024 మంది పౌరులను తీవ్రవాదులు చంపారని, అందులో ఎక్కువగా గిరిజనులు ఉన్నారని తెలిపింది. "పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ముఖ్యంగా తెందు పట్టా కాంట్రాక్టర్లు, రవాణాదారులు, ప్రభుత్వ సేవకులు, లెఫ్ట్ వింగ్ ఎక్ట్సమిస్ట్ (ఎల్ డబ్ల్యుఈ) రాష్ట్రాల్లో వివిధ అక్రమ మైనింగ్ మాఫియా గ్రూపుల నుంచి వామపక్ష తీవ్రవాద సమూహాలు దారుణంగా వసూళ్లు చేస్తున్నాయి" అని రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిబాయ్ చౌదరి తెలిపారు. ఢిల్లీకి చెందిన డిఫెన్స్ స్టడీస్ ఇన్స్టిట్యూట్, ఎనాలసిస్ అంచనా ప్రకారం, సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఏటా రూ.140 కోట్లకు తక్కువ కాకుండా వసూలు చేస్తోందని వెల్లడించారు.