: తెలంగాణలో షర్మిల యాత్రను అడ్డుకున్న విద్యార్థి జేఏసీ
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్రను మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం చిట్యాలలో విద్యార్థి జేఏసీ నేతలు అడ్డుకున్నారు. ఈ సమయంలో వారిపై వైఎస్సార్సీపీ నేతలు దాడి చేయబోయారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని వారిని చెదరగొట్టారు. కాగా, తెలంగాణలో నాలుగోరోజు షర్మిల యాత్ర కొనసాగుతోంది.