: మోదీ తమిళనాడుకు వస్తే అడ్డుకుంటాం: వైగో
తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడుకు వస్తే, నల్ల జండాలతో అడ్డుకుంటామని ఎండీఎంకే నేత వైగో హెచ్చరించారు. శ్రీలంకలో వేలాదిమంది తమిళుల ఊచకోతకు కారణమైన రాజపక్స తిరుమలకు వస్తే రాచమర్యాదలు చేయడాన్ని ఆయన విమర్శించారు. రాజపక్స తిరుమలకు రాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అడ్డుకొని ఉండాల్సిందని వైగో అభిప్రాయపడ్డారు. లంకలో తమిళులు నిర్మించుకున్న 1500 ఆలయాలను రాజపక్స ధ్వంసం చేయించాడని ఆరోపించారు. తమిళ మీడియా ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. తమ మనోభావాలు దెబ్బతిన్నందునే అధికార ఎన్డీఏకు గుడ్ బై చెప్పామని వైగో తెలిపారు.