: ఉబెర్ క్యాబ్ సర్వీసులు దేశంలో ఎక్కడా కనపడకూడదు: రాజ్ నాథ్ సింగ్
ఉబెర్ క్యాబ్ సర్వీసులను నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాజ్యసభలో ప్రసంగించారు. కాగా, ఢిల్లీ ప్రభుత్వం ఉబెర్ క్యాబ్ సర్వీసులను నిషేధించిన సంగతి తెలిసిందే. అలాగే ఉబెర్ క్యాబ్ సర్వీసెస్ ద్వంద్వప్రమాణాలు పాటిస్తోందని తేలింది. ఉబెర్ క్యాబ్ డ్రైవర్ చేతిలో ఓ మహిళ అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. నిబంధనలు పాటించకుండా ఈ ట్రావెల్స్ సర్వీసులను నడిపిస్తోందని తేలింది. అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా టాక్సీ సర్వీసులు నడిపే ఉబెర్, భారత దేశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ మహిళకు అన్యాయం చేసింది.