: బాంబే ఐఐటీ విద్యార్థినికి ఫేస్ బుక్ బంపర్ ప్యాకేజి

ఇటీవల కాలంలో భారత విద్యార్థులకు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పేరెన్నికగన్న సంస్థలు భారీ వేతనాలతో ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. తాజాగా, బాంబే ఐఐటీ విద్యార్థిని ఆస్థా అగర్వాల్ కు సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ ఏడాదికి రూ.2 కోట్ల బంపర్ ప్యాకేజి ప్రకటించింది. ఈ 20 ఏళ్ల జైపూర్ అమ్మాయి థర్డ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఈ వార్త తెలిసిన వెంటనే ఆస్థా కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. దీనిపై, ఆమె మాట్లాడుతూ, గత మే, జూన్ మాసాల్లో కాలిఫోర్నియాలో ఫేస్ బుక్ సంస్థలో శిక్షణ పొందానని, వారు తన పనితీరును గుర్తించారని తెలిపింది. సంస్థ తన పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు భారీ వేతనంతో ఉద్యోగాన్నీ ఆఫర్ చేసిందని వివరించింది. కంప్యూటర్ సైన్స్ నాలుగో ఏడాది పూర్తైన తర్వాత వచ్చే ఏడాది అక్టోబరులో 'ఫేస్ బుక్' ఉద్యోగంలో జాయిన్ అవుతానని తెలిపింది. అందుకు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నానని తెలిపింది.

More Telugu News