: 'లింగా' విడుదల ఆపుతూ మధ్యంతర ఆదేశాలు ఇవ్వొద్దు: కోర్టులో రజనీ కేవియట్
తాను నటించిన 'లింగా' చిత్రాన్ని అడ్డుకోవాలని కొందరు చూస్తున్నారని, తన వాదన వినకుండా ఎటువంటి మధ్యంతర ఆదేశాలూ ఇవ్వరాదని కోరుతూ సూపర్ స్టార్ రజనీకాంత్ మధురై కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. తన కథను కాపీ కొట్టి 'లింగా' సినిమా తీశారంటూ కే.ఆర్.రవిరత్నం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టు విడుదలను తాత్కాలికంగా నిలిపే అవకాశం ఉండటంతో, దాన్ని ఆపేందుకు రజనీ కేవియట్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. కాగా, బుధవారం నాడు రజనీ తరపున న్యాయవాది సంజయ్ రామస్వామి కోర్టులో వాదన వినిపించనున్నారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 'లింగా' విడుదల కానున్న సంగతి తెలిసిందే.