: ఏకే-47 ట్రిగ్గర్ లాగే వేలి కంటే, ఈవీఎం బటన్ నొక్కే వేలు ఎంతో శక్తిమంతం: మోదీ

శ్రీనగర్ ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో ప్రజలను ఉత్తేజపరిచే రీతిలో ప్రసంగించారు. ఏకే-47 తుపాకీ ట్రిగ్గర్ లాగే వేలి కంటే, పోలింగ్ సమయంలో ఈవీఎం బటన్ నొక్కే వేలు శక్తిమంతమైనది అని వ్యాఖ్యానించారు. తద్వారా, ఉగ్రవాదులు హింసతో ఏమీ సాధించలేరన్న విషయాన్ని పరోక్షంగా ఎత్తిచూపారు. అదే సమయంలో ప్రజాస్వామ్యం ఔన్నత్యాన్ని కూడా చాటిచెప్పారు. బుల్లెట్లకు బ్యాలెట్ తో సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు జమ్మూకాశ్మీర్లో నాలుగు చోట్ల టెర్రరిస్టులు దాడి చేయడం తెలిసిందే.

More Telugu News