: మళ్లీ మైక్ పట్టనున్న సాధ్వి నిరంజన్ జ్యోతి
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొని, ఆపై క్షమాపణలు చెప్పిన కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మరోసారి మైక్ పట్టనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తూ నేడు 90 చోట్ల సభలను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. కొన్ని సభల్లో సాధ్వి ప్రసంగిస్తారని ఆ పార్టీ ప్రకటించింది. ఆమెతోపాటు రవి శంకర్ ప్రసాద్, మేనకాగాంధీ, నజ్మా హెప్తుల్లా తదితరులు పాల్గొంటారని తెలిపింది.