: గడువుకు ఒకరోజు ముందే షెడ్డును తొలగించిన నటుడు వెంకటేష్

ఫిలింనగర్ లోని రోడ్ నెంబర్-1లో నటుడు వెంకటేష్ కు స్థలం ఉంది. దాంట్లో ఆయన అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారంటూ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం ఇప్పటికే నోటీసులు జారీచేసింది. దీంతో, నోటీసుల్లో పేర్కొన్న గడువుకు ఒకరోజు ముందే వెంకటేష్ షెడ్డును తొలగించారు. శనివారం నాడు ఈ కూల్చివేతను వెంకటేష్ స్వయంగా పర్యవేక్షించారు. అంతేగాకుండా, కూల్చివేత అనంతరం స్థలాన్ని ఫొటోలు తీయించి, టౌన్ ప్లానింగ్ అధికారులకు అందజేశారు. అంతకుముందు, గడువులోగా నిర్మాణాలు తొలగించకపోతే, తామే కూల్చివేయాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ తమ నోటీసుల్లో హెచ్చరించింది.

More Telugu News