: బీజింగ్ లో ప్రారంభమైన ఎ.పి.ఇ.సి సదస్సు
అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవటమే ప్రధాన లక్ష్యంగా 21 దేశాధినేతలు హాజరౌతున్న ఆసియ పసిఫిక్ ఎకనామిక్ కో-ఆపరేషన్ (ఎపిఇసి) సదస్సు మంగళవారం నాడు బీజింగ్ లో చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఎ.పి.ఇ.సి సమావేశాలు మొదలై 25 సంవత్సరాలు కావడం, ఈ దఫా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం సదస్సుకు హాజరు కావడంతో సమావేశాలపై అంచనాలను పెంచాయి.
ఆసియ పసిఫిక్ దేశాలలో సంస్కరణల అమలు, వినూత్న ఆవిష్కరణలకు ప్రోత్సాహం, దీర్ఘకాల ఒప్పందాలకు ప్రాధాన్యం ఇవ్వటం వంటి అంశాలపై దృష్టిని కేంద్రీకరించినట్టు జి జిన్ పింగ్ తెలిపారు. ఎ.పి.ఇ.సి సంస్థాగత అభివృద్ధి నిమిత్తం 10 మిలియన్ డాలర్లను అందిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఇందులో ఇండియాకు సభ్యత్వం లేని సంగతి తెలిసిందే.