: టీడీపీ తీర్థం పుచ్చుకున్న నెల్లూరు కాంగ్రెస్ నేతలు
నెల్లూరు జిల్లా కాంగ్రెస్ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వారు పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, నెల్లూరు డీసీసీబీ చైర్మన్ ధనుంజయ్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ జయకుమార్ రెడ్డి, ఆనం జయకుమార్ రెడ్డిలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు టీడీపీలో చేరారు. సీఎంగా చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రభావితులమై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.