: కాంగ్రెస్ పై చిదంబరం కుమారుడి వ్యాఖ్యలపై ఇళంగోవన్ స్పందన

తమిళనాడు కాంగ్రెస్ యూనిట్ అనుసరిస్తున్న విధానాలు, వైఖరిపై కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ ఇటీవల మీడియా ముందు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీకి స్వతంత్ర ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ స్పందించారు. పార్టీపై వెల్లడించే అభిప్రాయాలు, అంతర్గత విషయాలు కేవలం పార్టీ లోపలే చెప్పాలి కానీ, మీడియా ఎదుట కాదని కార్తీకి గట్టిగా సమాధానం ఇచ్చారు. పార్టీలో అంతర్గత విషయాలపై చర్చిస్తున్నప్పుడు నేతలు బయట మాట్లాడటం సమంజసం కాదని ఇళంగోవన్ సూచించారు.

More Telugu News