: ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్
శ్రీలంకతో మూడో వన్డే కోసం హైదరాబాద్ చేరుకున్న టీమిండియా జట్టు సభ్యులు శనివారం ఉదయం ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్నారు. ఆదివారం లంకతో టీమిండియా మూడో వన్డే ఆడుతుంది. ఐదు వన్డేల సిరీస్ లో ఇప్పటికే టీమిండియా రెండు మ్యాచ్ లు గెలిచి 2-0 ఆధిక్యం సాధించింది.