: 'షాడో క్యాబినెట్ కమిటీలు' ఏర్పాటు చేసిన కాంగ్రెస్
లోక్ సభలో తమకు ప్రతిపక్ష హోదాను నిరాకరించిన కారణంగా, కాంగ్రెస్ పార్టీ 'షాడో క్యాబినెట్ కమిటీ'లను ఏర్పాటు చేసింది. ప్రభావవంతమైన ప్రతిపక్షంగా ఉండాలన్న నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా ఈ కమిటీల కార్యకలాపాల నిర్వహణ కొనసాగుతుంది. ఈ నెల 24 నుంచి శీతాకాల పార్లమెంటు సమావేశాలు జరగనున్న క్రమంలో మొత్తం ఏడు కమిటీలను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది.
కమిటీల్లో ఏకే ఆంటోనీ, వీరప్ప మొయిలీ, ఆనంద్ శర్మ, ఆస్కార్ ఫెర్నాండెజ్ సహా పలువురు మాజీ మంత్రులు, లోక్ సభలో పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్ నబీ అజాద్ వంటి ప్రముఖులు సభ్యులు ఉన్నారు. మోదీ సర్కారులోని కీలక మంత్రిత్వ శాఖల పనితీరు, నిర్ణయాలు, విధానాలను ఎప్పటికప్పుడు నిశితంగా ఈ కమిటీలు పరిశీలిస్తాయని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు.