: ఇరాన్ సర్వోన్నత నాయకుడు ఖొమేనీకి ఒబామా సీక్రెట్ లెటర్

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) టెర్రరిస్టులపై పోరులో సాయపడాలంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇరాన్ సర్వోన్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖొమేనీకి ఓ రహస్య లేఖ రాశారు. ఒబామా అక్టోబర్ లో ఈ లేఖ రాసినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. అయితే, దీనిపై, విమర్శలు వెల్లువెత్తాయి. ఐఎస్ఐఎస్ గ్రూపు ఎదుగుదలకు ఇరాన్ అధినాయకత్వమే కారణమని పేర్కొంటున్న రిపబ్లికన్లు ఒబామాపై విరుచుకుపడ్డారు. ఓ వైపు, ఐఎస్ఐఎస్ పై పోరులో తమకు మరింతగా సాయపడాలంటూ సిరియా దళాలు చేస్తున్న ఆక్రందనలను వినిపించుకోకుండా, ఒబామా తాజాగా ఖొమేనీకి లేఖ రాయడం దారుణమని సెనేటర్లు జాన్ మెక్ కెయిన్, లిండ్సే గ్రాహం విమర్శించారు.

More Telugu News