: అన్ని అంశాలపై చర్చకు సిద్ధం: కేసీఆర్
శాసనసభలో అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. శుక్రవారం సభ ప్రారంభం కాగానే పలు అంశాలపై చర్చకు విపక్షాలిచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. దీంతో సభలో విపక్ష సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. విపక్ష సభ్యుల వాదనపై స్పందించిన కేసీఆర్, రాష్ట్రంలోని అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అయితే సభ సజావుగా సాగితేనే అర్థవంతమైన చర్చకు ఆస్కారముంటుందని ఆయన తెలిపారు.