: ‘పవనిజం’ పేరిట సైబర్ నేరాలు!

'పవనిజం' పేరిట గుర్తు తెలియని కొందరు నెటిజన్లు చేస్తున్న పనులు పలువురిని ఇబ్బందులకు గురి చేయడమే కాక పవనిజాన్ని కూడా అభాసుపాల్జేస్తున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. 'పవనిజం జిందాబాద్' అంటూ ఓ గుర్తు తెలియని హ్యాకర్, తనను తాను బన్నీగా పేర్కొంటూ విజయవాడకు చెందిన లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల అధికారిక వెబ్ సైట్ ను స్తంభింపజేశాడు. 'మీ కళాశాల వెబ్ సైట్ సెక్యూరిటీ సిస్టం చాలా వీక్ గా ఉంది' అని పేర్కొన్న సదరు హ్యాకర్, వెబ్ సైట్ ను బన్నీ పేరిట స్తంభింపజేసి, హోం పేజీలో ‘పవనిజం జిందాబాద్’ అన్న నినాదాన్ని పోస్ట్ చేశాడు. సదరు నినాదానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫొటోను జత చేశాడు. ఈ దుర్ఘటనకు పాల్పడ్డ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్న కళాశాల యాజమాన్యం వెబ్ సైట్ ను పునరుద్ధరించి యథావిధిగా కార్యకలాపాలు సాగిస్తోంది.

More Telugu News