: ఢిల్లీలో పార్టీ తరపున వారిద్దరూ ప్రచారం చేస్తారు: కాంగ్రెస్
దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, ఈ రోజు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. అందులో ఢిల్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో పార్టీ సీనియర్ నేతలు సజ్జన్ కుమార్, జగదీష్ టైట్లర్ కూడా ఉన్నారు. అయితే, వారిద్దరినీ కమిటీలోకి తీసుకోవడం కలకలం రేపింది. కారణం, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను రెచ్చగొట్టారంటూ వారిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దాంతో, కేసులు కూడా నమోదయ్యాయి. అయితే, సజ్జన్, టైట్లర్ ఇద్దరూ ప్రచారం చేస్తారని, ప్రజాస్వామ్య దేశంలో ప్రచారానికి అందరూ అర్హులేనని కాంగ్రెస్ నేత షకీల్ అహ్మద్ అన్నారు.