: పాశ్చాత్య విస్కీ బ్రాండ్లకు షాకిచ్చిన జపాన్ బ్రాండు

పాశ్చాత్య దేశాల విస్కీ బ్రాండ్లకు ప్రపంచంలో మంచి పేరుంది. అయితే, ఓ జపనీస్ బ్రాండ్ కాస్తా ఇప్పుడు వాటిని మించిపోయింది. ఏకంగా ప్రపంచ అత్యుత్తమ విస్కీ బ్రాండ్ అవార్డు కైవసం చేసుకుంది. ఆ బ్రాండ్ పేరు 'యమజాకి సింగిల్ మాల్ట్ షెర్రీ కాస్క్ 2013'. తాజాగా ప్రకటించిన వరల్డ్ బెస్ట్ విస్కీ బ్రాండ్ల జాబితాలో టాప్-5లో ఒక్క స్కాటిష్ బ్రాండ్ కూడా లేదు. సంటోరీ కంపెనీ తయారు చేసే ఈ యమజాకి విస్కీని 12 నుంచి 15 ఏళ్లపాటు నిల్వచేసిన తర్వాతే మార్కెట్లోకి విడుదల చేస్తారు. అందుకే దానికంత రుచి వస్తుంది. ఇది జపాన్ ప్రాచీన విస్కీ బ్రాండు. పరిమితంగా ఏడాదికి కేవలం 18000 బాటిళ్లు మాత్రమే తయారుచేస్తారు.

More Telugu News