: మీడియా దృష్టిని ఆకర్షించేందుకు సభను వాడుకోవద్దు: హరీష్ రావు

కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, టీఎస్ మంత్రి హరీష్ రావు విపక్షాలకు పలు వినతులు చేశారు. సభ రసాభాసగా కొనసాగకుండా సహకరించాలని కోరారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకో, మీడియా దృష్టిని ఆకర్షించేందుకో సభను వినియోగించుకోరాదని అన్నారు. బంగారు తెలంగాణను సాధించుకునే క్రమంలో, ప్రజా సంక్షేమం కోసం తయారు చేసిన బడ్జెట్ ను సభలో సజావుగా ప్రవేశపెట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యతా రహితమైన విమర్శలకు దూరంగా ఉండాలని సూచించారు. మంచి సూచనలు చేస్తే స్వీకరిస్తామని చెప్పారు.

More Telugu News