: ఇది ప్రజల బడ్జెట్ కాదు... కేసీఆర్ కుటుంబ బడ్జెట్: రేవంత్ రెడ్డి
ఈ రోజు తెలంగాణ శాసనసభలో ప్రవేశపెడుతున్నది ప్రజల బడ్జెట్ కాదని... కేసీఆర్ కుటుంబ బడ్జెట్ అని టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్ తయారీలో మంత్రుల హస్తం ఏ మాత్రం లేదని ఆయన మండిపడ్డారు. వాటర్ గ్రిడ్, రోడ్ల కోసం కేటీఆర్ కు రూ. 35 వేల కోట్లు, చెరువుల పునరుద్ధరణ, సాగునీటి పేరుతో హరీష్ రావుకు మరో రూ. 35 వేల కోట్లను బడ్జెట్ లో కేటాయిస్తున్నారని ఆరోపించారు. ప్రజాసమస్యలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని సభలో నిలదీస్తామని అన్నారు. ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు.