: ప్రవీణ్, మైకేల్ హస్సీ లని వదిలించుకుని... ఉన్ముక్త్, వినయ్ ని కొనుక్కుంది
ఐపీఎల్ 2015 సీజన్ కి సన్నాహాలు ఆరంభమయ్యాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తొలిసారిగా ప్రవేశపెట్టిన 'ట్రేడింగ్ విండో' ద్వారా రాజస్థాన్ రాయల్స్ నుంచి ఉన్ముక్త్ చంద్, కోల్కతా నైట్ రైడర్స్ నుంచి ఆర్.వినయ్ కుమార్ ను ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది. దీంతోపాటు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న ప్రవీణ్ కుమార్, మైఖేల్ హస్సీని రిలీజ్ చేసింది. దీంతో 2015 క్రీడాకారుల వేలంలో వీరిని వేరే జట్లు కొనుగోలు చేయవచ్చు. 2015 ఐపీఎల్ కోసం అక్టోబర్ లో మొదటి 'ట్రేడింగ్ విండో' తెరిచారు. కాగా, దీని గడువు డిసెంబర్ 12తో ముగియనుంది. ఎపీఎల్ 2015 ఎడిషన్ ఏప్రిల్ 8 నుంచి మే 24 వరకు జరుగనుంది.