: బడ్జెట్ కూ ఓ ట్యాగ్ లైన్ తగిలించారు!

ఇటీవల కాలంలో సినిమా పేర్ల కింద ట్యాగ్ లైన్లు కామన్ అయిపోయాయి. వాటి తరహాలోనే తెలంగాణ సర్కారు కూడా తమ బడ్జెట్ కు కూడా ఓ ట్యాగ్ లైన్ తగిలించేసింది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా, రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, 'సంక్షేమం-అభివృద్ధి' తమ బడ్జెట్ ట్యాగ్ లైన్ అని వివరించారు. అన్ని రంగాలకు ఉపయోగపడేలా ఈ బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయని అన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన జరిగే క్యాబినెట్ భేటీలో బడ్జెట్ ను ఆమోదించనున్నారు. ఆ తర్వాత 11 గంటలకు బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఈటెల తెలిపారు.

More Telugu News