: సోమాజిగూడలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ
హైదరాబాదులోని సోమాజిగూడలో నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెడుతూ ఓ సాఫ్ట్ వేర్ సంస్థ బోర్డు తిప్పేసింది. తమ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామంటూ 100 మంది నిరుద్యోగుల నుంచి 60 నుంచి 80 వేల రూపాయల వరకు వసూలు చేసిన యాప్టీ టెక్నో సాఫ్ట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. జరిగిన మోసాన్ని గ్రహించిన బాధిత నిరుద్యోగులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.