: 'మహా' సీఎం ఇంటర్వ్యూ చాన్స్ సంపాదించిన పక్కింటి బాలిక

ముఖ్యమంత్రులన్న తర్వాత వారి ఇంటర్వ్యూల కోసం ఎన్నో అభ్యర్థనలు వస్తుంటాయి. అది కొత్త విషయమేమీ కాదు. కానీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కు మాత్రం ఓ పదకొండేళ్ల బాలిక నుంచి ఇంటర్వ్యూ చాన్స్ కోరుతూ లేఖ వచ్చింది. ఆ బాలిక ఫడ్నవిస్ నివాసముంటున్న సహ్యాద్రి గెస్ట్ హౌస్ పక్కనే నివసిస్తోంది. సెక్యూరిటీ గార్డులు లోనికి అనుమతించడం లేదని, తన స్కూల్లో ఇచ్చిన హోం వర్క్ కోసం ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇవ్వాలని ఆ అమ్మాయి లేఖలో పేర్కొంది. అంతేగాకుండా, తన ఫోన్ నెంబర్, అడ్రస్ కూడా పొందుపరిచింది. లేఖ అందితే ఫోన్ చేయాలని తెలిపింది. లేఖపై వెంటనే స్పందించిన సీఎం ఫడ్నవిస్ తన సిబ్బందిని పంపి, ఆ చిన్నారిని పిలిపించుకుని, హోం వర్క్ పూర్తిచేసుకునే అవకాశం కల్పించారు.

More Telugu News