: వాఘా బాంబర్ లక్ష్యం భారతేనట!
వాఘా సరిహద్దు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన దాడికి పాల్పడ్డ ఆత్మాహుతి దళ సభ్యుడి లక్ష్యం భారతేనని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. సదరు ఆత్మాహుతి దళ సభ్యుడి అంచనాలో చోటుచేసుకున్న చిన్న పొరపాటు కారణంగా పేలుడు పాక్ భూభాగంలో జరిగిందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాఘా సరిహద్దు వద్ద ఉగ్రవాదులు రచించిన దాడి విఫలమై, సొంత దేశ జనాన్నే పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో ఆ తరహాలోనే మరిన్ని దాడులు భారత భూభాగంలో జరిగే ప్రమాదం లేకపోలేదని కూడా ఆ వర్గాలు పోలీసులను అప్రమత్తం చేశాయి.
పేలుడు జరిగిన మరుసటి రోజు పెద్ద సంఖ్యలో సిక్కులు పాక్ నగరం లాహోర్ సమీపంలోని గురు నానక్ మందిరాన్ని దర్శించుకునేందుకు వెళతారు. వీరిని లక్ష్యంగా చేసుకుని దాడి జరపాలని తొలుత భావించినా, సదరు బాంబర్ ఒకరోజు ముందుగానే పాక్ భూభాగంలో తనను తాను పేల్చుకున్నాడనడానికి తగిన ఆధారాలు లభించినట్లు విశ్వసనీయ సమాచారం.