: పీలేరులో భారీగా ఎర్రచందనం పట్టివేత

చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలో పోలీసులు భారీగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదయం నిర్వహించిన తనిఖీల్లో రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. ఈ సమయంలో 9 మంది స్మగ్లర్లు, 24 మంది కూలీలను అరెస్టు చేశారు. అలాగే తొమ్మిది వాహనాలను కూడా సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం పోలీసులు వారిని విచారిస్తున్నారు. రెండు రోజులకు ముందే చిత్తూరు జిల్లాలో రూ.కోటి విలువైన ఎర్రచందనాన్ని పట్టుకోగా, నిన్న (సోమవారం) విజయవాడలో కూడా భారీగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News