: వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు!
విద్యుత్ సబ్ స్టేషన్ లోకి అక్రమంగా చొరబడటమే కాక అక్కడి సిబ్బందిపై దౌర్జన్యానికి దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పై కేసు నమోదు చేసినట్లు నియోజకవర్గ పరిధిలోని యాదమరి ఎస్సై వెంకటేశ్ తెలిపారు. యాదమరి మండలం మోర్గానపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ లోకి ప్రవేశించిన సునీల్ కుమార్, అక్కడ పనిచేస్తున్న ఆపరేటర్ ను బెదించారని ఫిర్యాదు అందిందన్నారు. దీంతో సునీల్ కుమార్ పై 148, 348, 506, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.