: శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ప్రారంభం
శ్రీశైలం ప్రాజెక్టు లెఫ్ట్ పవర్ హౌస్ లో మంగళవారం ఉదయం మళ్లీ విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. సోమవారం ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతిని కలిసిన తెలంగాణ మంత్రి హరీశ్ రావు, విద్యుదుత్పత్తికి సంబంధించి సూత్రప్రాయ అంగీకారం తీసుకున్నారు. రెండు రోజులకు మూడు టీఎంసీల చొప్పున విద్యుదుత్పత్తికి వాడుకోవచ్చని ఉమా భారతి చెప్పారని హరీశ్ రావు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని తెలంగాణ సర్కారు ప్రారంభించింది. ప్రస్తుతం శ్రీశైలంలో 857 టీఎంసీల నీరుంది. 7 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 9 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్న తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తిని జరుపుతోంది.